1. ఇతరాలు
  2. వెబ్‌దునియా స్పెషల్ 08
  3. బ్రహ్మోత్సవాలు
  4. TTD EO Anil Kumar Singhal press meet on ttd brahmotsavam 2017

బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.18.70 కోట్లు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు శోభాయమానంగా జరిగాయి. ఆదివారం ఉదయంతో జరిగిన చక్రస్నానంతో ఈ వేడుకలు ముగిశాయి. ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణపై తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ.. బ్రహ్మోత్

ttd brahmotsavam 2017
శ్రీవారి బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు శోభాయమానంగా జరిగాయి. ఆదివారం ఉదయంతో జరిగిన చక్రస్నానంతో ఈ వేడుకలు ముగిశాయి. ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణపై తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.18.70 కోట్లుగా వచ్చినట్టు చెప్పారు. 
 
భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహన సేవలు, మూలవిరాట్ దర్శనం కల్పించామని చెప్పారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సూచనలు చేశారని తెలిపారు. 
 
ఈ బ్రహ్మోత్సవాల్లో 6.27 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారని, రూ.18.70 కోట్ల హుండీ ఆదాయం లభించిందని, గత ఏడాదితో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య, హుండీ ఆదాయం తగ్గిందన్నారు. 
 
23 లక్షల మందికి అన్న ప్రసాదం, 26.55 లక్షల లడ్డూలు పంపిణీ చేశామని,3.06 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని తెలిపారు. 
 
ఈ నెల 18, 25 తేదీల్లో నాలుగు వేల మంది వయోవృద్ధులు, వికలాంగులకు, ఈ నెల 19, 26 తేదీల్లో ఐదేళ్లలోపు చిన్నారుల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. 
About Writer
pnr
తర్వాతి కథనం
ఉల్లిపాయ రసంతో జుట్టును పెంచుకోండి.. ఎలాగంటే?