శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సినీ ఆవకాయ్
Written By pyr
Last Updated : శనివారం, 20 జూన్ 2015 (12:43 IST)

ప్రకాష్ రాజ్ వద్దనే హీరో ఉంటారా..! రజనీ వద్దన్నారట...!!

ప్రకాష్ రాజ్... ఆ సినిమాలో ఉన్నారంటే సినిమాలో విలన్ కారెక్టర్ వందశాతం సక్సెస్ అనే అంతటి నమ్మకం ఎవరికైనా. అందుకే ఆయన కావాలని కోరుకుంటారు. కానీ  ఆయనను వద్దనే వారు కూడా ఉన్నారనే విషయం ఈ మధ్యనే తేలింది. దక్షిణాది రాష్ట్రాల సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రకాష్ రాజ్ ను తన సినిమాలో విలన్ గా తీసుకోవడానికి వద్దన్నారట. 
 
ఎటువంటి క్యారెక్టర్‌లో‌నైనా ఒదిగి‌పోయి  మెప్పించగలడు ప్రకాష్ రాజ్.  అలాంటి ప్రకాష్‌రాజ్ సూపర్‌స్టార్ రజనీ‌కాంత్‌తో కలిసి నటించే ఛాన్సే దక్కించుకున్నాడు. రజనీ‌కాంత్ - రంజిత్ కాంబినేషన్‌లో ఆగస్టు నుంచి కొత్త మూవీ సెట్స్‌‌పైకి వెళ్లబోతోంది. ఇంతకు ముందు రెండు ప్లాపులను చూపిన రజనీతో రంజీత్ ఈ మూవీని ఛాలెంజింగ్‌‌గా తీసుకుని ప్రకాష్‌రాజ్‌కు ముఖ్యమైన పాత్ర ఇచ్చాడట. ఐతే, ప్రకాష్‌రాజ్ పేరు చెప్పగానే వద్దన్న రజనీకాంత్, డైరెక్టర్ రిక్వెస్ట్‌తో కన్విన్స్ అయి ఒకే అన్నాడని సమాచారం.