1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 2 అక్టోబరు 2018 (10:43 IST)

వైరల్ ఇన్ఫెక్షన్.. 8 రోజుల్లో 11 సింహాలు మృతి...

వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఎనిమిది రోజుల్లో 11 సింహాలు చనిపోయాయి. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని గిర్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. తాజాగా 8 రోజుల్లో 11 సింహాలు మృతి చెందినట్లు ఫారెస్ట్ అధికారులు నిర్ధారించ

వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఎనిమిది రోజుల్లో 11 సింహాలు చనిపోయాయి. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని గిర్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. తాజాగా 8 రోజుల్లో 11 సింహాలు మృతి చెందినట్లు ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. అంతర్గత కుమ్ములాటలు, వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్లే సింహాలు మృతి చెందినట్లు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే.
 
సెప్టెంబర్ 12 నుంచి 19వ తేదీ మధ్యలో 11 సింహాలు మృతి చెందగా, అదే నెల 20 నుంచి 30వ తేదీ మధ్యలో మరో 10 సింహాలు ప్రాణాలు కోల్పోయాయి. మొత్తంగా సింహాల మృతుల సంఖ్య 21కి చేరిందని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. 
 
సింహాలు వరుసగా మృతి చెందడంతో.. ఆ మృతదేహాల శాంపిల్స్‌ను పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, యూపీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, జునాఘడ్‌లోని వెటర్నరీ కాలేజ్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరికి పంపించారు. 
 
అలాగే, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పుణె ఇచ్చిన నివేదిక ప్రకారం.. నాలుగు సింహాలు ప్రోటోజోవా ఇన్‌ఫెక్షన్ వల్ల చనిపోయినట్లు తేలింది. అత్యధికంగా వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్లే సింహాలు మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. ఇక ముందస్తు జాగ్రత్తగా 31 సింహాలను సేమరధి ఏరియా నుంచి జమ్‌వాలా రెస్క్యూ సెంటర్‌కు తరలించారు.