147 ఏళ్ల వృద్ధుడు.. మనవరాలితో ఆడుకుంటూ..?
80 కాదు వంద కాదు 147 సంవత్సరాల పాటు ఓ వృద్ధుడు జీవిస్తున్నాడంటే నమ్ముతారా.. నమ్మితీరాల్సిందే. 147 ఓ వృద్ధుడు జీవిస్తూ... తన మనవరాలితో ఆడుకుంటున్నాడు. ప్రస్తుతం ఈయనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. కాంబోడియాకు చెందిన ఓ వృద్ధుడు మంచంపై పడుకొని తన చుట్టూ తిరుగుతున్న మనుమరాలిని ఆడిస్తున్నారు. ఆ వృద్ధుడు తన ఏడవ తరం అమ్మాయితో సంతోషంగా ఆడుకోవడం చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.