మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 ఏప్రియల్ 2022 (18:46 IST)

త్వరలోనే ట్విట్టర్‌లో ఎడిట్ ఫీచర్

twitter
సోషల్ మీడియా అగ్రగామి అయిన ట్విట్టర్‌లో త్వరలోనే ఎడిట్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఎడిట్‌ ఫీచర్‌ కోసం ఆతృతగా యూజర్లు కొద్ది రోజులుగా ఎదురుచూస్తున్నారు. యూజర్ల ఆసక్తిని గమనించిన ట్విట్టర్ కూడా వీలైనంత తొందరగా ఈ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
 
ఈ క్రమంలోనే ట్విట్టర్‌లో రాబోతున్న ఎడిట్‌ ఫీచర్‌ పనితీరు గురించి టెక్నాలజీ ఎక్స్‌పర్ట్‌ జాన్‌ మాన్‌చున్‌ వాంగ్‌ ఒక ఆసక్తికరమైన విషయం బయట పెట్టారు. ట్వీట్‌లో ఏమైనా మార్పులు చేసినప్పుడు సవరించిన ఆ మార్పులతో కొత్త ట్వీట్‌ క్రియేట్ అవుతుంది. 
 
కానీ ఎడిట్ చేసిన ట్వీట్ అనేది మారకుండా అలాగే ఉంటుంది. కొత్త ట్వీట్‌ పాత ట్వీట్‌‌‌తో కలిపి యూజర్‌ ప్రొఫైల్‌లో టాప్‌లో కనిపిస్తుంది.