మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: సోమవారం, 28 జూన్ 2021 (23:07 IST)

ఒక మామిడి 10 వేలు.. మామిడి అమ్మి లక్షాధికారి అయిన బాలిక..!

ఓ బాలిక రోడ్డుపక్కనే మామిడి పండ్లను విక్రయిస్తోంది. ఒక వ్యక్తి వచ్చి మామిడి పండ్ల ధర అడక్కుండానే ఒక్కో మామిడి పండును 10 వేలకు కొంటున్నట్లు బాలికకు చెప్పాడు. అన్నట్లుగానే 12 మామిడి పండ్లను తీసుకొని లక్షా 20వేల రూపాయలు బాలిక తల్లి బ్యాంకు అకౌంట్లో వేశాడు. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
 
జార్ఖండ్ జంషెడ్ పూర్‌కు చెందిన బాలిక పేరు తులసికుమారి. సాయం చేసిన వ్యక్తి పేరు హెగ్టే. వాలిబుల్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారట. పేద కుటుంబానికి చెందిన తులసీకుమారి ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతోంది. 
 
కరోనా కారణంగా పాఠశాలలు మూతపడి ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. స్మార్ట్ ఫోన్ కొనే ఆర్థిక స్ధోమత లేక రోడ్డు పక్కన మామిడి పండ్లు అమ్ముతూ ఉండేది తులసి. అయితే తులసి తన ఆర్థిక కష్టాల గురించి స్థానిక మీడియాకు తెలిపిందట.
 
ఈ విషయం తెలుసుకున్న హెగ్టే బాలికకు సాయం చేయాలనుకున్నాడట. ఒక్కో మామిడి పండును 10 వేలకు కొంటున్నట్లు ఆయన చెప్పగానే తులసి ఆశ్చర్యానికి గురైంది. డబ్బులు తులసి తల్లి బ్యాంకు ఖాతాలో బదిలీ చేశారు. దీంతో తులసి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసి ఆన్లైన్ తరగతులకు హాజరవుతోందట.