శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 మే 2022 (20:23 IST)

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన బీస్ట్ హీరో

KCR_vijay
KCR_vijay
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిశారు. బుధవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఈ సందర్భంగా ఇరువురు పరస్పర పుష్పగుచ్ఛాలు ఇచ్చుకున్నారు. నటుడు విజయ్‌‌కి శాలువా కప్పి సత్కరించారు సీఎం కేసీఆర్. 
KCR_vijay
KCR_vijay
 
కోలీవుడ్ హీరోకు ఓ వీణను బహూకరించారు కేసీఆర్. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తాను మర్యాదపూర్వకంగా కలిశానని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని సీఎంవో ట్వీట్ చేసింది. 
 
సాధారణంగా విజయ్ సినిమాలు కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర విధానాలను ప్రశ్నించే విధంగా ఉంటాయి. 
 
అలాంటి నటుడు.. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై ఎలాంటి పరిస్థితుల్లోనైనా విమర్శలు గుప్పించే తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, దళపతి విజయ్‌, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం బీస్ట్‌ ఇటీవల విడుదలైంది.