గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 28 మార్చి 2018 (11:26 IST)

నాతో పెట్టుకుంటే అడ్రస్ గల్లంతే.. ఆ ముగ్గురికి వార్నింగ్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లకు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. తనతో పెట్టుకుంటే అడ్రస్ గల్లం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లకు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. తనతో పెట్టుకుంటే అడ్రస్ గల్లంతేనంటూ హెచ్చరించారు. 
 
బుడగజంగాల మహాసభలో చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాల విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశానని అన్నారు. దీంతో, రాష్ట్రంపై కక్ష కట్టే పరిస్థితికి కేంద్రం వచ్చిందని, విభజన చట్టంలోని హామీలను అమలు చేయకపోతే వదిలిపెట్టనని కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తుంటే, రాష్ట్రంపై దాడి చేస్తున్నారని, అవమానకరరీతిలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
 
ముఖ్యంగా, నిన్నమొన్నటివరకు తమకు సహకరించిన జనసేన కూడా ఇపుడు తమపై విమర్శలు గుప్పిస్తోందని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకునేందుకు బీజేపీకి లొంగిపోయారని ఆరోపించారు. అందుకే ఎక్కడికక్కడ లాలూచీ పడుతున్నారని విమర్శించారు. ఎవరెన్ని మాట్లాడినా భయపడే సమస్యే లేదని, ఎన్ని శక్తులు అడ్డొచ్చినా సరే, ఎదిరించి ప్రజల పక్షాన నిలబడతామని చంద్రబాబు పునరుద్ఘాటించారు.