ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 21 ఆగస్టు 2021 (19:38 IST)

రోజాకు జగనన్న ఆశీస్సులు, ఎందుకో తెలుసా?

రోజా, సెల్వమణి దంపతులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. రోజాను సీఎం జగన్ ఆశీర్వదించారు. రోజా పెళ్లి రోజు సందర్భంగా జగన్ రోజా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. దర్శకుడు సెల్వమణిని రోజా 2002లో వివాహం చేసుకున్నారు. వారికి ఒకు కుమార్తె, కుమారుడు వున్నారు.
ఇదిలావుంటే రోజా తన స్వగృహంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పూజకు సన్నిహితులు, అభిమానులు సైతం హాజరయ్యారు. రోజాకు దైవభక్తి మెండు. ఆమె తన నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో చాలా చురుకుగా వుంటారు. అందుకే రోజా అంటే అక్కడి వారికి ఎనలేని అభిమానం.
కాగా తమ నాయకురాలికి ఈసారి మంత్రి పదవి ఖాయమని అంటున్నారు ఆమె అభిమానులు. సీఎం జగన్ ఆశీస్సులు మెండుగా వున్నాయి కనుక ఈసారి ఖాయమనే అనుకోవచ్చు.