శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 24 మే 2021 (19:11 IST)

బెర్నార్డ్ ఆర్నాల్ట్: ప్రపంచంలోనే నెంబర్ 1 కుబేరుడు

ప్రపంచంలోని ప్రముఖ ఫ్యాషన్ లగ్జరీ వస్తువుల సంస్థ లూయిస్ విట్టన్ మొయిట్ హెన్నెస్సీ (ఎల్విఎంహెచ్) యజమానులు బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబం 186.2 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతులయ్యారు. అంతేకాదు అతిపెద్ద ఆన్‌లైన్ రిటైల్ ప్లాట్‌ఫాం అమెజాన్ యజమాని జెఫ్ బెజోస్‌ను ఓడించారు.
 
ఫోర్బ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇటీవలి నెలల్లో ఆర్నాల్ట్ 538 మిలియన్ డాలర్లను వ్యాపార విస్తరణ కోసం ఖర్చు చేశారు. అతను మరియు అతని కుటుంబం నియంత్రణలో ఉన్న తన సొంత ఫ్రెంచ్ లేబుల్ బ్రాండ్ యొక్క వాటాలను సంపాదించాడు. 2021లో మొదటి త్రైమాసిక ఆదాయం 14 బిలియన్ డాలర్లు అని నివేదించిన తరువాత, ఆయన ప్రపంచంలోని రెండవ ధనవంతుడు ఎలోన్ మస్క్ - స్పేస్ఎక్స్, టెస్లా యజమానిని అధిగమించాడు.