సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : శనివారం, 11 ఆగస్టు 2018 (14:42 IST)

బిగ్ బాస్ హౌస్‌ టాస్క్‌లు.. మగాళ్లతో ఆడవాళ్లకు ఫిజికల్‌ గేమ్‌లా?

బిగ్ బాస్ హౌస్‌లో టాస్కులు ప్రస్తుతం వివాదాస్పదమవుతున్నాయి. ఈ వారం కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన టాస్క్‌లో తనీష్, దీప్తిలు పోటీపడ్డారు. కానీ దీప్తి సునయన తనీష్‌ని విజేతగా ప్రకటించింది. తనీష

బిగ్ బాస్ హౌస్‌లో టాస్కులు ప్రస్తుతం వివాదాస్పదమవుతున్నాయి. ఈ వారం కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన టాస్క్‌లో తనీష్, దీప్తిలు పోటీపడ్డారు. కానీ దీప్తి సునయన తనీష్‌ని విజేతగా ప్రకటించింది. తనీష్ ఎన్నుకున్న కలర్ రెడ్ కావడంతో గోడ మొత్తం ఆ కలర్ డామినేట్ చేసేసింది. ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకొని నిర్ణయాన్ని చెప్పాలని కౌశల్.. దీప్తి సునయనను రిక్వెస్ట్ చేసినా.. సునయన మాత్రం తనీష్ పేరే చెప్పింది.
 
అయితే గేమ్ ఆడే సమయంలో తనీష్.. దీప్తి నల్లమోతుని ఫిజికల్‌గా అడ్డుకున్నారు. ఆమెను గోడకు రంగు వేయనివ్వకుండా తన బలం మొత్తం ఉపయోగించి ఆపేశారు. దీప్తి ఎంతగా కష్టపడినా తనీష్ బారి నుండి విడిపించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే మగాళ్లతో ఆడవాళ్లకు ఫిజికల్ గేమ్‌లు పెట్టడం ఏంటని దీప్తి కాస్త ఎమోషనల్ అయింది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో కౌశల్ అభిమానులు తనీష్ చేసిన పనిని తప్పుబడుతున్నారు.
 
తనీష్ చేసిన పనే కౌశల్ చేసి ఉంటే హౌస్ మొత్తం ఏకమయ్యి కౌశల్‌ని టార్గెట్ చేసి మరింత దూషించేవారని కౌశల్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఆడవాళ్ల విషయంలో పురుషుల ఆగడాలు అని మాట్లాడే బాబు గోగినేని ప్రస్తుతం తనీష్ విషయంలో నోరెత్తలేదు ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు.