ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 23 జులై 2024 (22:26 IST)

నేను తప్పు చేసినా నన్ను శిక్షించాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

pawan kalyan
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర వనరులు కానీ లేదంటే ప్రజాధనం కానీ లేదంటే ఇంకేమైనా అవినీతికి పాల్పడితే ఎవ్వరినైనా... ఆఖరికి తననైనా తప్పు చేస్తే శిక్షించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇటువంటి బలమైన సంకేతం ప్రజలకు పంపాలని పిలుపునిచ్చారు.
 
తన పార్టీకి సంబంధించి జనసేన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైనా గత ప్రభుత్వం చేసింది కదా మేము కూడా చేస్తామని అంటే వాళ్లని నియంత్రించే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ప్రతి ఒక్కరు నిబద్ధతతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేసారు. కూటమి ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా వారిని వదులుకునేందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నేను వారిని వదులుకునేందుకు సిద్ధంగా వున్నామన్నారు.