సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 20 జులై 2024 (16:00 IST)

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పై అసభ్య పదజాలం: శ్రీరెడ్డిపై కర్నూలులో కేసు

srireddy
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పైన అసభ్య పదజాలం ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో దూషణలకు పాల్పడుతున్న సినీ నటి శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకుడు రాజు యాదవ్ చెప్పారు. ఆమెపై కర్నూలు 3 టౌన్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
 
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... శ్రీరెడ్డి విషపు పురుగు. ఇలాంటివారు సమాజంలో వుండకూడదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారిని సోషల్ మీడియాలో నోటికి వచ్చినట్లు దారుణ పదజాలాన్ని ఉపయోగిస్తూ దుర్భాషలాడుతున్నట్లు చెప్పారు. ఇలాంటి వ్యక్తిని ఎంతమాత్రం వదిలిపెట్టకూడదని అన్నారు. సభ్యసమాజం ఏమనుకుంటుందో అనేది కూడా ఇలాంటివారికి వుండదనీ, అందువల్ల ఆమెపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోరినట్లు రాజు యాదవ్ చెప్పారు.