ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 జనవరి 2023 (10:48 IST)

11 నెలల బాలుడి కడుపులో పిండం?

అస్సాం రాష్ట్రంలోని డిబ్రూఘడ్ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు 11 నెలల బాలుడి కడుపులో పిండాన్ని గుర్తించారు. దీన్ని అరుదైన ఆపరేషన్ ద్వారా తొలగించారు. ఆ శస్త్రచికిత్సను శనివారం విజయవంతంగా పూర్తి చేశారు. 
 
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని చాంగ్లాండ్ జిల్లాకు చెందిన బాలుడికి ఈ అరుదైన ఆపరేషన్ చేశారు. ఈ బాలుడు పుట్టిన కొన్ని నెలలకే అనారోగ్యంబారినపడ్డాడు. దీంతో అస్సాంలోని ఆస్పత్రికి తరలించారు. బాలుడికి అన్ని పరీక్షలు చేసిన తర్వాత కడుపులో పిండం ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. 
 
దీనిపై ఆపరేషన్ చేసిన వైద్యులు స్పందిస్తూ.. "బాలుడికి విజయవంతంగా ఆపరేషన్ చేశాు. ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. తాము జరిపిన వైద్య పరీక్షల్లో కడుపులో పిండం ఉన్నట్టు గుర్తించాం. వైద్య పరిభాషలో దీన్ని ఫెటస్ ఇన్ ఫీటూ అని అంటారు. ఇలాంటి సందర్భాలు చాలా అరుదు" అని వైద్యులు తెలిపారు.