సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 జనవరి 2023 (22:19 IST)

అట్టహాసంగా అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ నిశ్చితార్థం

Anant_Radhika
Anant_Radhika
అనంత్ అంబానీ - రాధిక మర్చంచ్ ల నిశ్చితార్థ వేడుక అట్టహాసంగా జరిగింది. ముకేశ్ అంబానీ, నీతా అంబానీల తనయుడు అనంత్ అంబానీ, విరెన్ మర్చెంట్, శైల దంపతుల కూతురైన రాధికా మర్చంట్ ల నిశ్చితార్థ వేడుక.. అంబానీ నివాసంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో సంప్రదాయం ప్రకారం వైభవంగా జరిగింది.  
 
గుజరాతీ సంప్రదాయం ప్రకారం ఈ వేడుక జరిగింది.  గోల్ ధన, చునారి విధి కార్యక్రమాలు కుటుంబ దేవాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు బహుమతులు ఇచ్చిపుచ్చుకుని ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 


Anant_Radhika
Anant_Radhika
 
అనంత్ సోదరి ఇషా నేతృత్వంలో అంబానీ కుటుంబ సభ్యులు రాధికను ఆహ్వానించడానికి మర్చంట్ నివాసానికి వెళ్లడంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. అంబానీ కుటుంబ సభ్యులు హారతి, మంత్రోచ్ఛారణల మధ్య రాధికా మర్చంట్ కుటుంబ సభ్యులకు ఘనంగా స్వాగతం పలికారు. 
 
ఈ వేడుకలో శ్రీమతి నీతా అంబానీ నేతృత్వంలో అంబానీ కుటుంబ సభ్యులు నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.  అనంత్ సోదరి ఇషా నిశ్చితార్థ వేడుక ప్రారంభమైనట్లు ప్రకటించింది. అంబానీ, మర్చంట్ కుటుంబ, స్నేహితుల సమక్షంలో అనంత్- రాధిక ఉంగరాలు మార్చుకున్నారు.  
 
ఇకపోతే.. అనంత్ అంబానీ బ్రౌన్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేశారు. ఆపై రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో సభ్యునిగా సహా వివిధ హోదాల్లో పనిచేశారు. జియో ప్లాట్‌ఫారమ్‌లు, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బోర్డులలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఎనర్జీకి నాయకత్వం వహిస్తున్నారు. 

Anant_Radhika
Anant_Radhika
 
ఇక శైలా, వీరేన్ మర్చంట్ ల కుమార్తె రాధిక న్యూయార్క్‌లో గ్రాడ్యుయేట్ విశ్వవిద్యాలయం, బోర్డ్ ఆఫ్ ఎన్‌కోర్ హెల్త్‌కేర్‌లో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.