ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2022 (15:34 IST)

అట్టహాసంగా రాధిక మర్చంట్ తో అనంత్ అంబానీ నిశ్చితార్థం

Anant Ambani
Anant Ambani
ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీల కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్థ వేడుక అట్టహాసంగా జరిగింది. రాజస్థాన్ లోని శ్రీనాథ్ జీ ఆలయంలో శైల, విరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్, నీతా అంబానీ, ముకేష్ అంబానీల కుమారుడు అనంత్ అంబానీల నిశ్చితార్థ వేడుక గురువారం కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జరిగింది.
 
ఈ యువ జంట శ్రీనాథ్ జీ ఆశీర్వాదం కోరుతూ ఆలయంలో రోజంతా గడిపారు. ఇందులో భాగంగా ఆలయంలో సాంప్రదాయ రాజ్-భోగ్-శ్రీంగార్ వేడుకలలో పాల్గొన్నారు. ఇందులో విరేన్ మర్చంట్, అలాగే అంబానీ కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు. 
Anant Ambani
Anant Ambani
 
కాగా... అనంత్, రాధిక స్నేహితులు. ఈ నిశ్చితార్థ వేడుకలో అనంత్-రాధిక వివాహ తేదీని నిర్ణయించే అవకాశం వుంది. అనంత్ అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో చదువును పూర్తి చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లో జియో ప్లాట్ ఫామ్స్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బోర్డులలో సభ్యుడిగా సహా వివిధ హోదాలలో పనిచేశారు. 
Anant Ambani
Anant Ambani
 
ప్రస్తుతం ఆయన ఆర్ఐఎల్ ఎనర్జీ బిజినెస్ కు నేతృత్వం వహిస్తున్నారు. రాధిక న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్, ఎన్ కోర్ హెల్త్ కేర్ బోర్డులో డైరెక్టర్ గా పనిచేస్తుంది.