శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 జనవరి 2024 (12:39 IST)

ఒంటెపై స్వారీ చేసిన వరుడు.. కేసు పెట్టిన పోలీసులు.. ఎక్కడ?

Groom Rides Camel
Groom Rides Camel
కేరళలోని కన్నూర్ జిల్లాలో ఓ వరుడు గుర్రంపై కాకుండా ఒంటిపై పెళ్లి ఊరేగింపుకు చేశాడు. అయితే ఒంటెపై ఊరేగింపుగా వెళ్లిన ఆ వరుడికి కష్టాలు తప్పలేదు. రోడ్డుపై ఒంటెపై స్వారీ చేస్తూ వెళ్లిన ఆ వరుడిపై కేసు నమోదైంది. ఎందుకంటే.. ఒంటె రోడ్డుపై అలా స్వారీ చేస్తూ వెళ్లడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ప్రజల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇంకా ఒంటెపై వరుడు స్వారీ చేసిన విజువల్స్ వైరల్‌గా మారాయి. 
 
వల పట్టణంకు చెందిన వరుడు రిస్వాన్.. 25 మందితో కలిసి ఈ వారం ప్రారంభంలో తన వివాహ వేదిక వద్దకు ఒంటెపై ఊరేగింపుగా వచ్చాడు. అయితే నడిరోడ్డుపై ఒంటెపై స్వారీ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఒంటెపై ఊరేగింపు, టపాకాయలు పేల్చడం, బ్యాండ్ మ్యూజిక్‌తో పాటు, రద్దీగా ఉండే రహదారిపై ట్రాఫిక్ స్తంభించి, విమానాశ్రయానికి వెళ్లే వాహనాలు, అంబులెన్స్ చిక్కుకుపోయాయి. ఫలితంగా వరుడిపై కేసు నమోదు చేయకతప్పలేదని పోలీసులు తెలిపారు.