సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 జనవరి 2024 (23:53 IST)

సోషల్ మీడియా సాయం.. కేరళలో పోయి.. గోవాలో దొరికింది.. ఏంటిది?

AirPod
సోషల్ మీడియా కాంటెంట్ ఏజెన్సీ స్టోంక్స్ స్టూడియో సహ వ్యవస్థాపకుడు నిఖిల్ జైన్ కేరళలో ఖరీదైన ఎయిర్‌పాడ్ పోగొట్టుకున్నాడు. దీనిని తిరిగి పొందేందుకు సోషల్ మీడియానే ఎంచుకున్నాడు. చివరికి పోగొట్టుకున్న ఎయిర్‌పాడ్ తిరిగి అతడి చెంతకు చేరింది. ఎలాగంటే... కేరళకు వెకేషన్ కోసం వచ్చిన నిఖిల్ బస్సులో ఎయిర్‌పాడ్ మర్చిపోయి దిగేశాడు. ఎలాగైనా దానిని కనుగొనేందుకు ఎంతగానో ప్రయత్నించాడు. పోలీసుల సాయం తీసుకున్నాడు. కానీ ఫలితం లేదు. 
 
చివరికి సోషల్ మీడియా సాయంతో ఆ తర్వాత తన ఎయిర్‌పాడ్ మంగళూరునుంచి గోవాకు వెళ్లినట్టు జైన్ గుర్తించాడు. అంతేకాదు, అతడు గోవా వ్యక్తే అయి ఉంటాడని నిర్ధారించుకున్నాడు. అలా తన ఎయిర్ పాడ్స్‌ను తిరిగిపొందాడు. సోషల్ మీడియా ద్వారా ఆయన చేసిన పోస్టుకు అనూహ్యంగా రెస్పాన్స్ వచ్చింది. నిమిషాల వ్యవధిలోనే గూగుల్ మ్యాప్ సాయంతో ఎయిర్‌పాడ్స్‌ను గుర్తించారు. త్వరలోనే వాటిని స్నేహితుడి సాయంతో తెప్పించుకోనున్నారు.