శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 ఏప్రియల్ 2023 (09:56 IST)

కారు బానెట్‌పై పోలీసు... 20 కిలోమీటర్లు దూరం కారు నడిపిన డ్రైవర్

car bonnet
మహారాష్ట్రంలో ఓ కారు డ్రైవర్ పోలీసు పట్ల దురుసుగా ప్రవర్తించాడు. మాదకద్రవ్యాలు తీసుకున్నాడన్న అనుమానంతో కారును ఆపేందుకు ప్రయత్నించిన ఓ పోలీస్‌ను కారుడ్రైవర్ ఢీకొట్టాడు. దీంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకునేందుకు ఆ పోలీస్ కారు బానెట్‌పై పట్టుకున్నాడు. అయినప్పటికీ కారు డ్రైవర్ మాత్రం కారును ఆపకుండా ఏకంగా 18 కిలోమీటర్ల దూరం ముందుకు పోనిచ్చాడు. ఈ ఘటన మహారాష్ట్రంలోని నవీ ముంబైలో జరిగింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మహారాష్ట్రలో పర్యటించారు. దీంతో పోలీసులు కోపర్‌ఖెరాణె - వాశీ మార్గంలో శనివారం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ డ్రైవర్ మాదకద్రవ్యాలు తీసుకున్నాడనే అనుమానంతో సిద్ధేశళ్వర్ మాలి (37) అనే ట్రాఫిక్ పోలీస్ మరో పోలీస్‌తో కలిసి ఓ కారును అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. డ్రైవర్ కారును ఆపకుండా ముందుకు పోనిచ్చారు. దీంతో సిద్ధేశ్వర్ మారి కారు బానెట్‌పై పడిపోయాడు. అయినా కారును మరింత వేగంగా ముందుకుపోనిచ్చాడు. 
 
ట్రాఫిక్ పోలీసు కారును గట్టిగా పట్టుకోగా ఆయన ఏకంగా 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న గవ్హాన్ ఫాటా ప్రాంతానికి చేరుకున్న తర్వాత కింద పడిపోయారు. ఇతర పోలీసులు ఆ కారును వెంబడించి.. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని 22 యేళ్ల ఆదిత్య బెంబ్డేగా గుర్తించారు. అతడు మాదక ద్రవ్యాలు సేవించినట్టు వైద్య పరీక్షల్లో తేలిందని పోలీసులు వెల్లడించారు. డ్రైవర్‌పై హత్యాయత్నం, నిర్లక్ష్య డ్రైవింగ్, మాదకద్రవ్యాలచట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.