1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (12:55 IST)

హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. నాలుగో అంతస్థు నుంచి దూకేసింది..

suicide
హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. కళాశాల భవనం నుంచి నాలుగో అంతస్థు నుంచి దూకేసింది. దీంతో ఈ ఘటనలో ఆ విద్యార్థినికి తీవ్రగాయాల పాలైంది. ఆసుపత్రికి తరలించే లోపే ఆ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. 
 
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌లో వున్న ఎక్సెల్ కాలేజీలో సోమవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. విద్య ప్రియాంక అనే విద్యార్థిని పాల్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన విద్య ప్రియాంక నీట్ కోచింగ్ కోసం ఎక్సెల్ కాలేజీలో చేరింది. హాస్టల్‌లో వుంటూ క్లాసులకు హాజరైంది. 
 
ఈ క్రమంలోనే రాత్రి పది గంటలకు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కాగా, విద్య ప్రియాంకకు తమ కాలేజీకి ఎలాంటి సంబంధంలేదని ఎక్సెల్ కాలేజీ యాజమాన్యం వివరణ ఇచ్చింది.