1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 మార్చి 2023 (10:36 IST)

ఉంగరం పోయిందని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య.. ఫ్యానుకు ఉరేసుకుని..

suicide
ఉంగరం పోయిందనే కారణంగా ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే,.. ఉంగరం ఎక్కడో పోగొట్టుకున్నానని అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని.. తనను క్షమించాలంటూ ఓ డిగ్రీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. 
 
ఆమె వరంగల్ మండలంలోని గున్నెపల్లి గ్రామానికి చెందింది. ఆమె పేరు హేమలత (19). మంగళవారం హేమలత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హనుమకొండలోని ఓ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. ఉగాది పురస్కరించుకుని ఇటీవల ఇంటికి వచ్చిన హేమలత చేతి వుంగరం మిస్ అయ్యింది. 
 
దీంతో మనస్తాపానికి గురైన సదరు యువతి ఇంట్లో వారు తిడుతారనే భయంతో.. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో సూసైడ్ లెటర్ రాసి ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై హేమల తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.