1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 18 జనవరి 2024 (10:45 IST)

సురేష్ గోపీ కుమార్తె వివాహ వేడుకలో ప్రధాని మోదీ, మమ్ముట్టి మోహన్‌లాల్

Suresh gopi- modi
Suresh gopi- modi
ఎటువంటి హంగూ ఆర్భాటాలు లేకుండా కేరళ సాంప్రదాయ పద్దతిలో జరిగిన మళయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ గారి కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు నరేంద్ర మోడి. భారత్ ప్రధానిగా ఆయన దేశంలోని అన్ని పుణ్య క్షేత్రాలను సందర్శిస్తూ ప్రతిష్టాత్మకమైన గురువాయురప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం అక్కడ సురేష్ గోపీ వివాహానికి హాజరైన వధూవరులను ఆశీర్వదించారు.
 
Suresh gopi- modi
Suresh gopi- modi
నటుడు, రాజ్యసభ ఎంపీ, సురేశ్ గోపీ కుమార్తె భాగ్య, వ్యాపారవేత్త శ్రేయాస్ మోహన్‌తో జనవరి 17న వివాహం జరిగింది. సాంప్రదాయ ప్రకారం కుమార్తె మెడలో తాళి కడుతుండగా సురేష్ గోపీ జెడను పట్టుకుని సహకరిస్తున్న ఫొటో కూడా పోస్ట్ చేశారు. కాగా, ఈ కార్యక్రమానికి మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన వారు మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. సురేష్ గోపీ కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది.