గొప్ప మనసు చాటుకున్న ప్రధానమంత్రి మోదీ: తన కాన్వాయ్ పక్కకు పెట్టి అంబులెన్స్‌కి దారి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తను పర్యటిస్తున్న సమయంలో అంబులెన్స్ సైరన్ విని వెంటనే తన కాన్వాయ్ ను పక్కకు మళ్లించాలని అధికారులకు సూచించారు. అలా అంబులెన్స్ వెళ్లేందుకు మార్గం సుగమం చేసారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద మనసుకి నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.
కాగా ప్రధాని తన సొంత నియోజకవర్గం వారణాసిలో రెండు రోజులు పర్యటనకు వచ్చారు. ఇందులో భాగంగా ఆయన రోడ్ షోలో పాల్గొంటున్న సమయంలో అటుగా అంబులెన్స్ వచ్చింది. దీనికి ఆయన దారి వదిలారు. ఈరోజు ఆయన వారణాసిలో కాళీ తమిళ్ సంగమం-2 కార్యక్రమాన్ని కన్యాకుమారి నుంచి వారణాసి వరకూ ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలును ఆయన ప్రారంభించారు.