గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 సెప్టెంబరు 2023 (14:21 IST)

చంద్రబాబు కాన్వాయ్‌ని దారి మళ్లిస్తున్న పోలీసులు

Babu
Babu
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఈరోజు ఉదయం 6 గంటలకు నంద్యాలలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కస్టడీ ఎదుర్కొంటున్న ఆయన ప్రస్తుతం రోడ్డు మార్గంలో విజయవాడకు వెళ్తున్నారు. తమ నాయకుడి అరెస్టుకు ప్రతిస్పందనగా, టిడిపి సభ్యులు వివిధ ప్రాంతాలలో నిరసన కార్యక్రమాలను ప్రారంభించారు. 
 
చంద్రబాబు కాన్వాయ్‌ వెళ్లే దారి పొడవునా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు కాన్వాయ్‌ గమనాన్ని మార్చాలని నిర్ణయించారు. కాన్వాయ్‌ను పొదిలి మీదుగా వెళ్లకుండా ఒంగోలు వైపు మళ్లించారు. అంతిమ గమ్యం గుంటూరు మీదుగా విజయవాడ చేరుకునే దిశగా పోలీసులు నిర్ణయించారు.