గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 సెప్టెంబరు 2023 (11:42 IST)

కుత కుత ఉడుకుతున్నాం.. ఎవడిని వదిలిపెట్టం.. పరిటాల సునీత

paritala sunitha
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో రాప్తాడు నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు నిర్బంధానికి నిరసనగా నాగసముద్రం గేటు వద్ద బైఠాయించి మాజీ మంత్రి పరిటాల సునీత నిరసన తెలిపారు. అయితే, పోలీసులు జోక్యం చేసుకుని, ప్రదర్శనను నిలిపివేసి, సునీతను అరెస్టు చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టుతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆమె అన్నారు. 
 
సరైన ఆధారాలు లేకుండా చంద్రబాబును పోలీసులు ఎలా అరెస్టు చేశారని పరిటాల సునీత ప్రశ్నించారు. ఈ క్రమంలో రాప్తాడు నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది. ప్రజాప్రతినిధుల చర్యలను అడ్డుకోవడం ప్రభుత్వం నిరంకుశ పాలనగా భావిస్తున్నదని పరిటాల సునీత విమర్శించారు. 
 
చంద్రబాబు నాయుడును పోలీసులు విడుదల చేసే వరకు నిరసనలు చేపట్టాలని ఆమె పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కుత కుత ఉడుకుతున్నామని.. ఎవడిని వదిలిపెట్టం..అంటూ పరిటాల సునీత బహిరంగంగానే హెచ్చరిక చేశారు.