1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. I wonder what this snake will do with that chappal. He got no legs Unknown location

పాముకు కాళ్లు లేవు కదా.. చెప్పును ఎత్తుకెళ్లి ఏం చేస్తుందో?

Snake
Snake
జంతువులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ వున్నాయి. తాజాగా ఓ పాముకు సంబంధించి వీడియో సోషల్ మీడియా తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ పొడవాటి పాము చెప్పును తీసుకుని అలా జారుకుంటూ వెళ్లిపోయింది. 
 
ఇటుకల లోపల నుంచి బయటికి వచ్చిన ఓ పెద్ద పాము.. ఇంటి వైపుకు వచ్చింది. ఆ పాముకు ఇంటి వెలుపల ఒక చెప్పు కనిపించింది. వెంటనే చెప్పును నోటితో పట్టుకుని చకచక పాకుతూ పారిపోతుంది. కొంచెం దూరం వెళ్లాక పొదల్లోకి వెళ్లింది. ఆపై కనిపించలేదు. 
 
ఈ వీడియో బీహార్ ప్రాంతానికి చెందిందని తెలుస్తోంది. ఈ ఫన్నీ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ పాము ఎత్తుకెళ్లిన చెప్పుతో ఏం చేస్తుందో.. నేను ఆశ్చర్యపోతున్నానని.. పాముకు కాళ్లు కూడా లేవు కదా అంటూ ఫన్నీ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ : నిరసనకు దిగిన అడ్వకేట్లు