గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : గురువారం, 17 నవంబరు 2022 (09:58 IST)

చెత్తను శుభ్రం చేస్తుంటే బుస్‌మంటూ శబ్దం.. తీరా చూస్తే భారీ పైథాన్

Python
సికింద్రాబాద్ రైల్ నిలయం పార్కులో భారీ కొండ చిలువను పారిశుద్ధ్య కార్మికులు గుర్తించారు. ఈ పార్కులోని చెత్తను శుభ్రం చేస్తుంటే బుస్ మంటూ శబ్దం వచ్చింది. దీంతో ఆందోళన చెందిన వారు మెల్లగా చెత్తను తొలగించగా, ఆ చెత్తలో భారీ కొండ చిలువ దాగివుండటం చూసి వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ తర్వాత స్థానికంగా ఉండే స్నేక్ క్యాచర్‌ ద్వారా ఆ కొండ చిలువను బంధించారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
సికింద్రాబాద్ రైల్ నిలయం వెనుక వైపున రైల్వే కాలనీ పార్కు ఉంది. ఇందులో మంగళవారం మధ్యాహ్నం సమయంలో పార్కులో పేరుకునిపోయిన చెత్తను పార్కు సిబ్బంది శభ్రం చేస్తున్నారు. పార్కులో ఉన్న చెత్తను తొలగిస్తున్న సమయంలో ఏవో శబ్దంతో పాటు కదలికలు కనిపించాయి. ఆ తర్వాత మెల్లగా చెత్తను తొలగించగా, ఏకంగా 14 అడుగుల భారీ కొండ చిలువను చూసి ఖంగుతిన్నారు. అక్కడ నుంచి వారు పరుగులు తీశారు. ఆ తర్వాత పాములుపట్టేవారి సాయంతో ఆ కొండ చిలువను బంధించి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు.