ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 నవంబరు 2022 (21:58 IST)

కేసీఆర్ వేషధారణలో అదరగొట్టిన విద్యార్థి.. ఎస్కార్ట్ కూడా..

kcrcm
దేశ వ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సూర్యాపేట జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) వేషధారణలో ఓ విద్యార్థి పాఠశాలకు వచ్చారు. 
 
ఎస్కార్ట్ ప్రోటోకాల్ ప్రకారం విద్యార్థిని పోలీసులు ఎస్కార్ట్‌తో రావడం ఆసక్తికరంగా ఉంది. అలాగే అధికారుల వేషధారణలో పలువురు విద్యార్థులు కూడా కనిపించారు. 
 
ఈ సందర్భంగా ఉపాధ్యాయుల నిబద్ధతను విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.