శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 10 నవంబరు 2022 (09:41 IST)

తిరుపతిలో ఇద్దరు అబ్బాయిలు.. ముగ్గురు అమ్మాయిలు జంప్...

missing
తిరుపతి పట్టణంలో ఐదుగురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. వీరిలో ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఈ ఐదుగురులో నలుగురు పదో తరగతి చదువుతుండగా, ఒకరు తొమ్మిదో తరగతి విద్యార్థి. మరో విద్యార్థిని కూడా తమతో రమ్మని పిలిచారు. కానీ, ఎక్కడికో చెబితే వస్తానని చెప్పడంతో అతడిని వదిలేసిన మిగిలిన ఐదుగురు విద్యార్థులు వెళ్లిపోయారు. అయితే, బాధిత తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఫోలీసులు... విద్యార్థుల వద్ద ఉన్న మొబైల్ సిగ్నెల్స్ ఆధారంగా ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 
వీరంతా తిరుపతిలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో చదవుతున్నారు. బుధవారం పరీక్ష రాసిన తర్వాత వీరంతా బయటకు వచ్చారు. పదో తరగతి చదువుతున్న ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి కలిసి తొమ్మిదో తరగతి చదువుతున్న అబ్బాయి ఇంటికి వెళ్లారు. అతడితో ఏదో మాట్లాడిన తర్వాత ఐదుగురూ కలిసి 9వ తరగతి చదువుతున్న మరో బాలుడి వద్దకు వెళ్లారు. అతడిని కూడా తమతో రమ్మని పిలిచారు. 
 
అయితే, ఎక్కడిక వెళ్తున్నామో, ఎందుకు వెళ్తున్నామో చెబితేనే తాను వస్తానని చెప్పాడు. తమతో వస్తేనే చెబుతామని వారు చెప్పడంతో అతడు వెళ్లేందుకు ఇష్టపలేదు. దీంతో అతడు లేకుండా ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు కలిసి వెళ్ళిపోయారు. అలా వెళ్లినవారు ఎంతకీ తిరిగి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు స్కూలు హెడ్మాస్టర్‍‌తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసి మొబైల్ ఫోన్ నంబర్ల ఆధారంగా ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే, తిరుపతి పట్టణంలోని సీసీటీవీ కెమెరాలు, విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను కూడా పరిశీలిస్తున్నారు.