శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 మే 2021 (19:56 IST)

పాకిస్థాన్ దాడి చేసినా యుద్ధ ట్యాంకులు రాష్ట్రాలే కొనుక్కోవాలా? కేజ్రీవాల్

ఒకవేళ ఢిల్లీపై పాకిస్థాన్ యుద్ధం చేస్తే ప్రజల ప్రాణాలు రక్షించేందుకు, ప్రతిదాడులు చేసేందుకు అవసరమైన యుద్ధ ట్యాంకులను రాష్ట్రాల్లో కొనుక్కోవాలా అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. 
 
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ల కొరతపై కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో అగ్రహం వ్యక్తం చేశారు. తొలుత కరోనా వ్యాక్సిన్‌ను భారతీయులే భారత్‌లో తయారు చేశారని, అప్పటి నుంచి టీకా నిల్వలు పెంచితే, సెకండ్ వేవ్‌ను సమర్థమంతంగా ఎదుర్కొని ఉండేవారని అభిప్రాయపడ్డారు
 
అంతేకాకుండా, కేంద్రం వ్యాక్సిన్లను ఎందుకు కొనడం లేదని ఆయన ప్రశ్నించారు. వ్యాక్సిన్ల విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛనివ్వడం లేదని మండిపడ్డారు. 'కేంద్రం వ్యాక్సిన్లను కొనడం లేదు. అలాగని రాష్ట్రాలకు స్వేచ్ఛనూ ఇవ్వడం లేదు. ప్రస్తుతం మనం కోవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఒకవేళ పాకిస్థాన్ భారత్‌పై దాడులు చేస్తే, రక్షించుకునే బాధ్యతను కూడా రాష్ట్రాలకే వదిలేస్తారా?.. సొంతంగా యుద్ధ ట్యాంకులు కొనుక్కోమని అంటారా?' అంటూ కేజ్రీవాల్ ప్రశ్నించారు.