గురువారం, 16 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 5 జూన్ 2024 (17:40 IST)

ఎన్నికల తర్వాత జగన్ ఆ మాట అన్నారంటే ఆయన ఎంత భ్రమలో వున్నారు: వైసిపి మాజీ ఎమ్మెల్యే

Jakkampudi Raja
కర్టెసి-ట్విట్టర్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పార్టీ పరాజయంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ... ఒక కులం అని కాదు... అన్ని కులాలు కలిసి వైసిపిని ఘోరంగా ఓడించాయని అన్నారు. ఈ ఓటమికి ఎన్నో కారణాలున్నాయని చెప్పుకొచ్చారు.
 
నియోజకవర్గంలో పనుల కోసం ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళితే... జగన్ గారు తాము ఇచ్చిన కాగితాన్ని సంబంధిత అధికారి చేతిలో పెట్టేవారు. ఆ కాగితంపై సంతకం చేయించుకోవడానికి మేము ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకూ పడిగాపులు కాయాల్సి వచ్చేది.

అలాంది దౌర్భాగ్యపు అధికారికి ఆ కాగితంపై సంతకం చేస్తే మా నియోజకవర్గంలో 10 వేల మంది ప్రజలకు మేలు కలుగుతుందని తెలియదు. ఏం చేయాలి.. ఇలా ఎన్నో సార్లు జరిగింది. ఇలాంటి కారణాలు ఎన్నో ఓటమికి బాటలు వేసాయి. జగన్ చుట్టూ చేరిన అధికారులు, కోటరీ అంతా కలిసి ఆయన్ను భ్రమలో పెట్టేసారు.
 
ఎన్నికలు ముగిసిన తర్వాత ఐపాక్ ఆఫీసుకి వెళ్లి ప్రపంచం అంతా మనవైపుకి చూడబోతుంది, వైనాట్ 175 అని అన్నారంటే ఆయన్ని ఎంత భ్రమలో పెట్టారో అర్థం చేసుకోవాలి అంటూ ఆవేదన వ్యక్తం చేసారు.