మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 18 మే 2018 (10:53 IST)

హైదరాబాద్‌కు చేరిన కర్నాటక రాజకీయం... తాజ్‌కృష్ణలో ఎమ్మెల్యేల క్యాంపు

కర్నాటక రాజకీయం హైదరాబాద్‌కు చేరింది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌కు తరలించారు. దీంతో హైదరాబాద్, తాజ్‌కృష్ణ హోటల్ వేదికగా ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయ

కర్నాటక రాజకీయం హైదరాబాద్‌కు చేరింది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌కు తరలించారు. దీంతో హైదరాబాద్, తాజ్‌కృష్ణ హోటల్ వేదికగా ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయాలు మారనున్నాయి.
 
మరోవైపు, పవర్ గేమ్‌లో పైచేయి సాధించేందుకు గురువారం నుంచే వ్యూహాలు ప్రతివ్యూహాల్లో బీజేపీ, కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీలు నిమగ్నమయ్యాయి. రాష్ట్ర సీఎంగా బీఎస్ యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే బీజేపీ ఆపరేషన్ కమల్ చేపట్టింది.
 
అదేసమయంలో క్యాంపు రాజకీయాలతో బీజేపీకి చుక్కలు చూపించాలని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఉన్నారు. ఇందులోభాగంగా, రెండు పార్టీల ఎమ్మెల్యేలను మొదట్లో కొచ్చిన్‌కు షిప్ట్ చేయాలనుకున్నా.. తర్వాత వ్యూహం మార్చారు. చివరి నిమిషంలో హైదరాబాదలోని తాజ్ కృష్ణా హోటల్‌కు షిప్ట్ చేశారు.