మమ్మల్ని జాబిల్లి ముంగిట దాకా తీసుకెళ్లిన #ISRO కి జేజేలు: రాజమౌళి
చివరి 15 నిమిషాలే టెర్రర్ అని ఇస్రో చైర్మన్ అన్నట్లే టెర్రర్ చూడాల్సి వచ్చింది. ఐతే ఇస్రో జాబిల్లి ముంగిట వరకూ మనల్ని తీసుకెళ్లింది. చంద్రయాన్ 2 విఫలమైనప్పటికీ ఇస్రో శాస్త్రవేత్తల ప్రయత్నం శభాష్ అంటోంది ఇండియా. ఈ సందర్భంగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి ట్విట్టర్లో స్పందించారు.
"అసాధారణమైనదాన్ని సాధించాలనే చేసే ప్రతి లక్ష్యంలో ప్రయాణం అనేది పెద్ద సవాల్. ఈ ప్రయాణంలో అవరోధాలు ఒక భాగం. మమ్మల్ని చంద్రుని దగ్గరికి తీసుకెళ్లడంలో #ISRO శాస్త్రవేత్తలు చేసిన గొప్ప కృషిని మెచ్చుకోవడంలో నేను యావత్ భారతదేశంలో ఒకడిని. మీరు మా హృదయాలను గెలుచుకున్నారు. మీ ప్రయత్నాలకు జేజేలు.'' అని పేర్కొన్నారు.