మరోసారి మునిగిన ముంబై... ఆరెంజ్ అలెర్ట్

Mumbai Rain
Last Updated: బుధవారం, 4 సెప్టెంబరు 2019 (15:32 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబై మరోమారు మునిగిపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన ముంబై మహానగరాన్ని మళ్లీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.

ముంబై నగరంలో రానున్న రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసి, ఆరెంజ్‌ అలర్ట్‌ను ప్రకటించింది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలో జనజీవనం స్తంభించింది.

రోడ్లపై పలు ప్రాంతాల్లో నీరు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో అన్ని రకాల రైళ్ళు, విమానాల రాకపోకలు స్థంభించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు వరదలతో ఇబ్బంది పడకుండా పలు ప్రభుత్వ విభాగాలు ట్విటర్‌లో చురుకుగా ఉంటున్నాయి. ముంబైను సురక్షితంగా ఉంచేందుకు ఏదైనా సహాయం కావాలంటే 1916కు కాల్‌ చేయాలని అధికారులు సూచనలు జారీ చేశారు.


దీనిపై మరింత చదవండి :