శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (19:09 IST)

ముంబైలోనే సంపన్న గణపతి.. బంగారం, వెండితో అలంకరణ..! (Video)

దేశవ్యాప్తంగా వినాయక చతుర్థి ఉత్సవాలు ప్రారంభమైనాయి. వినాయక చవితిని పురస్కరించుకుని సెప్టెంబర్ రెండో తేదీన దేశ ప్రజలందరూ పండగ చేసుకోగా, ఉత్తరాదిన వినాయక చతుర్థి ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. సాధారణంగా ఉత్తరాదిన ''గణపతి బప్పా మోరయా'' అంటూ వినాయకుని నామం మారుమోగుపోతుంది. 
 
ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అధిక సంపన్నుడైన గణపతిని రూపొందించారు. ఇక్కడ సంపన్నుడంటే.. వినాయకుడిని బంగారం, వెండితో అలంకరించారు. ఈ వినాయకుడి అలంకరణకు గాను జీఎస్బీ సేవా మండల్ అన్నీ ఏర్పాట్లు చేసింది. 
 
ఉత్తరాదిన పదిరోజుల పాటు జరిగే ఈ వినాయక జయంతి ఉత్సవాల్లో ముంబైలోని ఈ బంగారు, వెండితో అలంకృతమైన విఘ్నేశ్వరుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇంకా భక్తులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్నాడు.