సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 30 ఆగస్టు 2019 (16:45 IST)

శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు(Video)

తిరుమల శ్రీవారిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు, ఐపీఎల్‌ ఛైర్మన్‌ రాజీవ్‌శుక్లా శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీవీ సింధు తన తల్లిదండ్రులతో కలిసి అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆమెకు రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు.
 
ఐఐఎస్‌ఎఫ్‌లో అభిషేక్‌ వర్మకు స్వర్ణం 
ఇంటర్నేషనల్‌ షూటింగ్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌(ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) ప్రపంచకప్‌లో భారత్‌కు మూడు పతకాలు వచ్చాయి. పురుషుల పదిమీటర్ల ఎయిర్‌పిస్టల్‌ విభాగంలో అభిషేక్‌ వర్మ స్వర్ణం సాధించాడు. ఇదేవిభాగంలో సౌరభ్‌ చౌదురికి కాంస్యం లభించింది. 50 మీటర్ల 3 పొజిషన్‌ విభాగంలో సంజీవ్‌ రాజ్‌పుత్‌ రజతం సాధించాడు. షూటింగ్‌లో భారత క్రీడాకారులు రాణిస్తూ.. ఇప్పటికే 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 8 బెర్తులను ఖాయం చేశారు.