గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2019 (12:32 IST)

తితిదేలో అన్యమత ఉద్యోగులు తప్పుకోవాల్సిందే : సీఎస్ ఎల్వీ

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో పని చేస్తున్న అన్యమత ఉద్యోగస్తుల వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. ఈ అన్యమతస్తులు క్రైవవమతంపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గతంలో అనేక మార్లు స్వయంగా పట్టుబడ్డారు కూడా. ఇపుడు తితిదేలో పని చేసే అన్యమతస్తులు స్వచ్ఛంధంగా తప్పుకోవాలంటూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం హెచ్చరించారు. దీంతో అన్యమతస్తుల వ్యవహారం తెరపైకి వచ్చింది. 
 
ప్రస్తుతం తితిదేలో దాదాపు 45 మంది వరకు ఇతర కులస్తులు పని చేస్తున్నారు. వీరంతూ హిందూ ధర్మశాస్త్రాలకు విరుద్ధంగా నియమించగా, గతంలో వీరిని తొలగించారు. వీరి తొలగింపుపై హైకోర్టు స్టే విధించింది. ఈ క్రమంలో ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు చేయడంతో మరోమారు అన్యమతస్తుల అంశం తెరపైకి వచ్చింది. తితిదేలో పని చేస్తున్న అన్యమతస్తులు స్వచ్ఛంధంగా తప్పుకోవాలని ఆయన హెచ్చరించడంతో ఈ అంశం చర్చకుదారితీసింది.