శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 27 ఆగస్టు 2019 (18:21 IST)

తిరుమల కొండపైకి వెళ్ళేందుకు ఇకపై ఆ వాహనాలకు నో ఎంట్రీ..

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదాలను నివారించే చర్యల్లో భాగంగా అధికారులు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సొంత వాహనాల్లో తిరుమల కొండపైకి వెళ్లి, స్వామి వారికి దర్శించుకోవడానికి వెళ్లే భక్తుల వాహనం 2003 సంవత్సరం కంటే ముందు నాటిదైతే, ఇకపై ఆ వాహనాలను తిరుమల కొండపైకి అనుమతించరట. పర్యావరణ పరిరక్షణ భాగంగా టీటీడీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
2003 కంటే ముందు తయారైన, అలాగే కాలం చెల్లిన వాహనాలను నిన్నటి నుంచి (ఆగస్టు,26,2019) కొండపైకి అనుమతించటం లేదు. అలాంటి వాహనాలను విజిలెన్స్ అధికారులు అలిపిరి ఘాట్ రోడ్డు మొదటిలోనే నిలిపి చెక్ చేసి వెనక్కి పంపిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల కాలం చెల్లిన వాహనాల కారణంగా సంభవించే ఘాట్ రోడ్డు ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.