సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 21 జులై 2022 (21:23 IST)

Draupadi Murmu: 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము

Draupadi Murmu
అనుకున్నదే జరిగింది. దేశ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. మూడో రౌండ్ పూర్తి అయ్యే సమయానికి పోలైన మొత్తం వ్యాలిడ్ ఓట్లలో 50 శాతానికి పైగా ముర్ము గెలుచుకోవడంతో విజయం సునాయసమైంది.

 
celebrations
ఇప్పటి వరకు ముర్ముకు 2,161 ఓట్లు రాగా వాటి విలువ 5,77,777. యశ్వంత్ సిన్హాకు 1,058 ఓట్లు రాగా వాటి విలువ 2,61,062. కాగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఇప్పటికే శ్రీమతి ముర్ముని అభినందించారు. " మొదటిసారిగా రాష్ట్రపతిగా ఓ గిరిజన మహిళను ఎన్డీఏ తరపున ఎంపిక చేసినందుకు, దేశానికి ఓ గిరిజన మహిళను రాష్ట్రపతిగా అందించినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు. అస్సాంలో సంపూర్ణ ఆనందం ఉంది, ముఖ్యంగా తేయాకు తోటలలో, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు," అన్నారాయన.

 
celebrations
మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన కేబినెట్‌లోని కొందరు సీనియర్ సభ్యులు, బిజెపి చీఫ్ జెపి నడ్డా ఫలితాలు ప్రకటించిన తర్వాత ఆమెను అభినందించడానికి తీన్‌మూర్తి మార్గ్‌లో తాత్కాలికంగా బస చేస్తున్న ద్రౌపది ముర్ముని సందర్శించి అభినందనలు తెలిపేందుకు వెళ్లనున్నట్లు సమాచారం.

 
ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగిసిన మరుసటి రోజు జూలై 25న రాష్ట్రపతిగా ఎన్నికైన వారు ప్రమాణ స్వీకారం చేస్తారు.