శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 4 డిశెంబరు 2021 (11:41 IST)

మా పిల్లి పారిపోయింది, ఆచూకి చెబితే రూ.20,000 బహుమతి, ఎక్కడ?

మనుషులు మిస్సింగ్ అయితే రివార్డు ప్రకటిస్తుంటారు. ఐతే జంతువులు తప్పిపోయినప్పుడు కూడా కొందరు అరుదుగా రివార్డులు ప్రకటిస్తారు. తాజాగా బంజారాహిల్స్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడు తన తప్పిపోయిన పెంపుడు పిల్లిని కనుగొనడంలో సహాయం చేసిన వారికి రూ.20,000 నగదు బహుమతిని ప్రకటించాడు.

 
బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 4లో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త అభిరాజ్ సిన్హా, తన పిల్లి, 2 సంవత్సరాల వయస్సు గల జోయా, గురువారం సాయంత్రం నుండి తప్పిపోయిందని చెప్పారు. 2019లో దీపావళి మరుసటి రోజు కాలిన గాయాలతో ఉన్న మూడు నెలల పిల్లి పిల్లగా ఉన్నప్పుడు దానిని తను కనుగొన్నట్లు చెప్పాడు. వెంటనే పిల్లిని తీసుకెళ్లి గాయాలకు చికిత్స చేసాము, ఇక అప్పట్నుంచి ఆ పిల్లి మాతోనే వుంటోంది.

 
సీసీటీవీ ఫుటేజీలో సాయంత్రం 4:25 గంటలకు పిల్లి ఇంటి నుంచి వెళ్లినట్లు చూపించింది. అప్పటి నుంచి ఆ పిల్లి కోసం ఎక్కడికక్కడ వెతుకుతున్నా ఫలించలేదు. ఎవరైనా కనుగొంటే రూ. 20,000 రివార్డ్‌ను ఇస్తానంటూ అతడు ప్రకటించాడు.