బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 మే 2022 (16:44 IST)

బ్యాక్‌గ్రౌండ్ ఎఫెక్ట్ కోసం అడవినే తగులబెట్టిన టిక్ టాకర్.. అరెస్ట్

pakistani tik toker
pakistani tik toker
పాకిస్థానీ మహిళా టిక్ టాకర్ ఇబ్బందుల్లో చిక్కుకుంది. లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న ఓ పాకిస్థానీ సోషల్ మీడియా స్టార్ కేవలం పదిహేను సెకన్ల టిక్ టాక్ వీడియో కోసం ఏకంగా అడవినే తగలబెట్టింది. అంతే చిక్కుల్లో పడింది. అడవికి నిప్పు పెట్టడమే కాకుండా.. ఆ వేడి సెగల్లోనుంచి నడుస్తూ వీడియోకు ఫోజులివ్వడం పలు విమర్శలకు తావిస్తోంది. 
 
వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్ టిక్ టాకర్ హుమైరా అస్గర్ అనే యువతి సిల్వర్ బాల్ గౌనులో మండుతున్న అడవి కొండల నడుమ సరదాగా నడుస్తున్న క్లిప్‌ను పోస్ట్ చేసింది. అంతేగాకుండా, "నేను ఎక్కడ ఉన్నా.. అక్కడ మంటలు చెలరేగుతాయి" అనే ట్యాగ్‌ను జత చేసింది. జస్ట్ బ్యాగ్రౌండ్ ఎఫెక్ట్ కోసం ఉద్దేశపూర్వకంగా అడవికి నిప్పు పెట్టినందుకుగానూ పోలీసులు ఆ టిక్ టాకర్‌ను అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.