శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 14 మే 2018 (11:22 IST)

మీరడగకూడదు.. నేను చెప్పకూడదు: పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో స్పందిస్తూ, తిరుమల కొండపై రాజకీయ అంశాలు మాట్లాడటం ఇష్టం లేదన్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో స్పందిస్తూ, తిరుమల కొండపై రాజకీయ అంశాలు మాట్లాడటం ఇష్టం లేదన్నారు. 'దేవుడి సన్నిధిలో ఆధ్యాత్మిక విషయాలు తప్ప మరేమీ మాట్లాడకూడదు. మీరడగకూడదు. నేను చెప్పకూడదు' అని ఆయన పేర్కొన్నారు.
 
ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. సంతృప్తిగా స్వామిదర్శనం అయ్యిందన్నారు. తిరుమలలోని యోగనరసింహస్వామి ఆలయం వద్ద తనకు నామకరణం, అన్నప్రాశన చేశారని.. తిరుమలతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. 
 
కాగా, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తన రాజకీయ బసు యాత్రను ప్రారంభించనున్నారు. దీన్ని పురస్కరించుకుని ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు.