శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (14:08 IST)

మెడలో గణేషుడి లాకెట్, టాప్‌లెస్ ఫోజుతో రెచ్చగొడుతున్న గాయని

ఫోటో కర్టెసీ-ట్విట్టర్
మరో వివాదానికి పాప్ ఐకాన్ రిహన్న తెరలేపింది. తన టాప్‌లెస్ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇలాంటి టాప్ లెస్ ఫోటోలను చాలామంది చేస్తుంటారు. కానీ ఈమె తన మెడలో గణేష్ లాకెట్టు ధరించి ఉంది. చిత్రాన్ని రిహన్న ధృవీకరించిన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇప్పుడీ ఫోటో వైరల్‌గా మారింది.
 
దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో కొనసాగుతున్న రైతుల ఆందోళనకు మద్దతుగా ట్వీట్ చేసిన రిహన్న భారతీయుల నుండి తీవ్రమైన ట్రోల్ ఎదుర్కొంది. అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు. రిహన్న ఒక నిర్దిష్ట మతాన్ని అగౌరవపరిచినందుకు వివాదంలో పడటం ఇదే మొదటిసారి కాదు.
 
2013 లో రిహన్న అబుదాబిలోని షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు కేంద్రంలో ఫోటోషూట్ చేసింది. అయితే, ఆమె కొన్ని అభ్యంతరకర ఫోటోలను తీసి వాటిని పోస్ట్ చేసింది. అప్పట్లో దీనిపై తీవ్రమైన దుమారం చెలరేగింది. ఐనా ఈమె అవేమీ పట్టించుకోకుండా సంచలనం సృష్టించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తోంది.