శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2019 (12:56 IST)

మొహ్రం నిప్పు తిరునాళ్లు.. గోడకూలింది.. వీడియో చూస్తే?

మొహ్రం పండుగను పురస్కరించుకుని జరిగిన నిప్పు తిరునాళ్లలో విషాదం చోటుచేసుకుంది. కానీ ఆ నిప్పు తిరునాళ్లలో ఒళ్లు గగుర్పాటు జరిగే చర్య జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఏపీ, కర్నూలుకు సమీపంలో బిర్లా అనే గ్రామంలో మొహ్రం పండుగను పురస్కరించుకుని నిప్పు తిరునాళ్లు జరిగాయి.
 
దీనిని తిలకించేందుకు భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చారు. ఆ సమయంలో నిప్పు తిరునాళ్లు జరిగే ప్రాంతానికి సమీపంలో అనూహ్యంగా గోడ కూలి అక్కడున్న వారిపై పడింది.

ఈ ఘటనలో 20మందికి పైగా గాయాలపాలయ్యారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. నిప్పు తిరునాళ్ల సమయంలో గోడకూలిన వీడియో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోను మీరు ఓ లుక్కేయండి.