శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 14 నవంబరు 2018 (16:57 IST)

ముద్దు సీన్లు, శరీరంపై ఎక్కడపడితే అక్కడ కెమెరాలు పెట్టారు.. సంజన క్షమాపణలు

శాండల్‌వుడ్‌లో తనకు భయానక అనుభవాలు ఎదురయ్యాయని, ముద్దు సీన్లతో పాటు తన శరీరాన్ని అభ్యంతరకరంగా చిత్రీకరించారని.. దర్శకుడు రవి శ్రీ వాస్తవ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించి కలకలం సృష్టించిన నటి సంజన వెనక్కి తగ్గింది. సంజన ఆరోపణలను దర్శకుల సంఘం ఖండించింది. ఆమె అసత్య ఆరోపణలు చేస్తోందని పేర్కొంది. 
 
సంజన బేషరతుగా క్షమాపణలు చెప్పే వరకు కన్నడ సినిమాల్లో ఆమెకు అవకాశం కల్పించబోమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో దిగివచ్చిన సంజన దర్శకుడు శ్రీవాత్సవ, దర్శకుల సంఘం అధ్యక్షుడు నాగేంద్ర ప్రసాద్‌, సంఘం పథాధికారులకు ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పింది.
 
కాగా రంగుల ప్రపంచంలో అడుగుపెట్టిన తనకు చేదు అనుభవాలు ఎదురయ్యాయని.. తన తొలి సినిమా గండ-హెండతి చిత్రీకరణ సమయంలో వేధింపులు ఎదుర్కొన్నానని సంజన ఆరోపించింది. తన శరీరంపై ఎక్కడపడితే అక్కడ కెమెరాలు పెట్టి అసభ్యంగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకు తాను వ్యతిరేకిస్తే ఇండస్ట్రీలో భవిష్యత్తు లేకుండా చేస్తానని హెచ్చరించారని ఆరోపించిన సంగతి తెలిసిందే.