శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (13:25 IST)

నారా లోకేష్‌‌ను ఒక గంట పంపండి.. కె.ఎ.పాల్.. ఎందుకలా..?

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్ ఈ మధ్యకాలంలో ప్రముఖ రాజకీయ నేతలను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎపిలో అభివృద్థి అనేది అస్సలు జరగలేదని, అభివృద్థి కావాలంటే ప్రజాశాంతి పార్టీకే ఓటెయ్యాలంటున్నారు. ఎపిలో జరిగిన అభివృద్థి గురించి ఎవరితోనైనా డిబేట్‌లో పాల్గొనడానికి సిద్థమని సవాల్ విసిరారు కె.ఎ.పాల్.
 
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో డిబేట్‌కు వస్తే మాట్లాడేందుకు సిద్థంగా ఉన్నానని, అలాగే జగన్, పవన్ కళ్యాణ్‌‌తో కూడా డిబేట్‌కు సిద్థమంటున్నారు కె.ఎ.పాల్. అయితే వీరెవరూ పాల్ వ్యాఖ్యలపై స్పందించకపోవడంతో కె.ఎ.పాల్ నారా లోకేష్‌‌ను టార్గెట్ చేశారు. 
 
గంటపాటు నారా లోకేష్‌‌ను చంద్రబాబు పంపిస్తే ఎపిలో తెలుగుదేశం ఎలాంటి అభివృద్థి చేయలేదని నిరూపిస్తానని, డిబేట్‌కు లోకేష్‌‌ను పంపించడంటూ చంద్రబాబును కోరుతున్నారు కె.ఎ.పాల్. 175 స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీ పోటీ చేయనుంది.