సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2019 (15:15 IST)

ఆరో అంతస్తు నుంచి తలకిందులుగా యోగా ఫోజ్.. ఏమైందంటే?

యోగా కోసం 80 అడుగుల ఎత్తుతో కూడిన భవనంలో తలకిందులుగా నిలబడిన యువతి దారుణంగా గాయాలపాలైంది. యోగా చేస్తానని.. తలకిందులు నిలబడిన ఆ యువతి అదుపుతప్పి జారిపడటంతో తీవ్ర గాయాలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంది.  ఈ ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెక్సికోలోని ఓ కాలేజీలో చదువుతున్న 23 ఏళ్ల యువతి అలెక్సా థెరిసా. 
 
ఈమె ఆరో అంతస్తు బాల్కనీ నుంచి తలకిందులుగా యోగా చేస్తానని స్నేహితులతో చెప్పింది. దీన్ని వీడియో తీయాల్సిందిగా స్నేహితులకు చెప్పింది. కానీ అదుపు తప్పి బాల్కనీ కమ్మీ నుంచి కిందపడిపోయింది. 
 
8వ అంతస్తు నుంచి కిందపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తలకిందులుగా 8వ అంతస్తు నుంచి కిందపడటంతో ఆమె శరీరంలోని 110 ఎముకలు విరిగిపోయాయి.

వెన్నెముక, నడుము, తలకు భారీ గాయాలైనాయి. థెరిసా పరిస్థితి విషమంగా వుందని వైద్యులు తెలిపారు. ఇకపోతే.. థెరిసా స్నేహితురాలు.. ఆమె యోగా చేస్తున్నప్పుడు తీసిన ఫోటోను నెట్టింట్లో షేర్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.