Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

నో మంగళగిరి, గో తిరుపతి: నారా లోకేష్ సీటు గురించి...

Written By జె
Updated: శనివారం, 25 డిశెంబరు 2021 (19:47 IST)
జమిలీ ఎన్నికలు త్వరలో జరుగబోతున్నాయనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. మరో సంవత్సరంలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దేశం మొత్తం ఒకే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలన్నది పార్టీల ఆలోచన. అందుకే ఇప్పటి నుంచి వ్యూహాలకు పదును పెట్టేస్తున్నారు నేతలు. 

 
అయితే ఎపిలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షం వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో టిడిపిలో ప్రధాన నేతలుగా ఉన్న చంద్రబాబు, నారా లోకేష్‌లు గెలుపే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. చంద్రబాబును కుప్పంలోనే ఓడిస్తామని వైసిపి నేతలు సవాల్ చేస్తుంటే మంగళగిరిలో ఈసారి లోకేష్ ఓటమి ఖాయమంటూ అధికార పార్టీ నేతలు స్పష్టం చేశారు.

 
ఈ నేపథ్యంలో కుప్పంలో తాను ఎలాగైనా గెలవగలనని.. కానీ ఎలాగైనా లోకేష్‌ను గెలిపించాలన్న పట్టుదలతో చంద్రబాబు ఉన్నారట. అందుకే ఈసారి ఎలాగైనా నారా లోకేష్‌ను తిరుపతి నియోజకవర్గంలో నిలబెట్టాలనుకుంటున్నారట. ఎందుకంటే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు.

 
ఈ నేపథ్యంలో తిరుపతిలో భూమన కుమారుడు నిలిచే అవకాశముంది. కాబట్టి తిరుపతి లాంటి ప్రాంతంలో ఎమ్మెల్యేగా నిలబడితే గెలుపుతో పాటు టెంపుల్ సిటీ కావడంతో ప్రాధాన్యత ఉంటుందన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారట. ఇదే విషయాన్ని లోకేష్‌కు కూడా చెప్పారట. 

 
పార్టీ నేతలతో మరోసారి చంద్రబాబు చర్చించి తిరుపతినే లోకేష్‌కు ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయట. ఇదే జరిగితే తిరుపతిలో హాట్ హాట్‌గా ఎన్నికలు జరుగుతాయన్నది సుస్పష్టం. 
 

అన్నీ చూడండి

Bigg Boss Telugu 10: డబుల్ ఎలిమినేషన్... మనస్సు విప్పిన చరణ్ మహాదేవ్

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

ప్రేమంటే కేవలం రొమాన్స్ కాదు : శోభిత ధూళిపాళ్ల

K. Raghavendra Rao: నా వైఫ్ మిస్సింగ్ నుంచి అరెరే వినవా.. సాంగ్ రిలీజ్ చేసిన కె.రాఘవేంద్రరావు

Pooja Hegde: శ్రీ శ్రీ చిత్రం నుంచి 36 ఏళ్ళ పూజా హెగ్డే పుట్టినరోజు పోస్టర్

తర్వాతి కథనం
Show comments