బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 20 ఆగస్టు 2021 (18:36 IST)

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహ్మద్ షమీ భార్య హసిన్ జహాన్

ఫోటో కర్టెసీ-ఇన్‌స్టాగ్రాం
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ భార్య హసిన్ జహాన్ మరోసారి సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటో షేర్ చేసి సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈమె తన ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఉంటుంది.
 
ఇన్‌స్టాగ్రామ్‌లో హసిన్ జహాన్‌కు మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. హాసిన్ జహాన్ తన బోల్డ్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. చాలామంది అభిమానులు హసిన్ జహాన్ అందాన్ని ప్రశంసించగా, బోల్డ్ ఫోటోను పోస్ట్ చేసినందుకు కొందరు ఆమెను ట్రోల్ చేశారు.
 
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫోటోలో హసిన్ చాలా అందంగా కనిపిస్తోంది. ఆమె రఫ్‌డ్ జీన్స్, బ్లాక్ టాప్ ధరించి ఆమె నేరుగా కెమెరా వైపు చూస్తున్న క్లోజప్ షాట్. కొన్ని వ్యక్తిగత సమస్యల కారణంగా షమీ మరియు హసిన్ జహాన్ చాలా కాలంగా విడివిడిగా ఉంటున్నారు. ఈ ఇద్దరి మధ్య వివాదం చాలా కాలంగా కొనసాగుతోంది కానీ ఈ జంట ఇంకా విడాకులు తీసుకోలేదు.
 
వారి వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత, షమీ ఇతర మహిళలతో సంబంధాలు కలిగి ఉన్నాడని హాసిన్ ఆరోపించింది. షమీ, అతని కుటుంబంపై ఇప్పటివరకు ఎలాంటి ఆరోపణలు నిజమని నిరూపించబడలేదు. కోల్‌కతాకు చెందిన మోడల్ హసిన్ జహాన్, మహమ్మద్ షమీ ఏప్రిల్ 7, 2014 న వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది.