శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 3 జులై 2018 (17:33 IST)

బీహార్ సీఎంను ఇంట్లోకి అడుగుపెట్టనివ్వను : తేజ్ ప్రసాద్ యాదవ్

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ చేసిన మోసాన్ని ఎన్నటికీ మరచిపోలేమనీ, అందువల్ల మా ఇంట్లోకి అడుగుపెట్టేందుకు ఆయనకు ప్రవేశం లేదనీ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. బీజేపీతో కటీఫ్ చెప్పి మళ్లీ

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ చేసిన మోసాన్ని ఎన్నటికీ మరచిపోలేమనీ, అందువల్ల మా ఇంట్లోకి అడుగుపెట్టేందుకు ఆయనకు ప్రవేశం లేదనీ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. బీజేపీతో కటీఫ్ చెప్పి మళ్లీ ఆర్జేడీతో చేతులు కలిపేందుకు నితీశ్ కుమార్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటికెళ్లి వారిని బుజ్జగించేందుకు నితీశ్ ప్రయత్నిస్తున్నారు.
 
ఉపముఖ్యమంత్రిగా పని చేసిన తేజ్ ప్రసాద్ యాదవ్... బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను తన ఇంట్లోకి కూడా రానివ్వబోనని తేల్చి చెప్పారు. పైగా, తన ఫేస్‌బుక్ ఖాతాను బీజేపీ - ఆర్సెస్ హ్యాక్ చేసిందని ఆయన ఆరోపించారు. తనకు పెరుగుతున్న పాపులారిటీని చూసి తట్టుకోలేక సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం నితీశ్ కుమార్ తన సోషల్ మీడియా ప్రోఫైల్స్‌ను హ్యాక్ చేస్తున్నారన్నారు. 
 
మహాకూటమి నుంచి విడిపోయిన నితీశ్… మళ్లీ ఆ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో మహాకూటమిలోకే కాదు… నితీశ్‌ను తన ఇంటికి కూడా రానివ్వబోనని చెప్పారు. అంతేకాకుండా, 'నో ఎంట్రీ నితీశ్ చాచా' అనే పేపర్‌ను ఇంటి గేట్‌కు అతికించారు. 
 
కొంతకాలంగా వివిధ అంశాలపై నితీశ్ బహిరంగంగానే బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీహార్‌కు స్పెషల్ స్టేటస్, డీమానిటైజేషన్, జీఎస్టీ వంటి అంశాలపై బీజేపీపై బహిరంగంగానే నితీశ్ విమర్శలు చేశారు. దీంతో నితీశ్ బీజేపీని వదిలిపెట్టి మహాకూటమిలోకి వస్తున్నారనే వార్తలు కొంతకాలంగా అటు సోషల్ మీడియాలో కూడా హాల్‌చల్ చేస్తున్నాయి.